అమెరికాలో తెలుగు వాళ్ల ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయి: సీఎం జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో తెలుగు వాళ్ల ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయి: సీఎం జగన్

  • డల్లాస్ లో తెలుగు ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్
  • తనకు దక్కిన గౌరవంగా భావిస్తానంటూ వెల్లడి
  • అమెరికాలో తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డల్లాస్ లో తెలుగు ఎన్నారైల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. తన పట్ల తెలుగు వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయని పేర్కొన్నారు. డల్లాస్ లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వినమ్రంగా తెలిపారు. తెలుగు వాళ్లలో కనిపించిన ఉత్సాహం, ఉత్సుకత అమోఘం అని జగన్ తన ట్వీట్ లో వివరించారు. తన పట్ల చూపిన విశేష ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
USA
Jagan
Andhra Pradesh

More Telugu News