పాక్ నిరసనకారుల నుంచి త్రివర్ణ పతాకాలను లాగేసుకున్న భారత పాత్రికేయురాలు
- ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా లండన్ లో ప్రదర్శన
- దుష్ట స్వభావాన్ని బయటపెట్టుకున్న పాకిస్థానీలు
- భారత త్రివర్ణ పతాకాన్ని కాళ్లతో తొక్కుతూ వికృతానందం
ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని కిందపడేసి కాళ్లతో తొక్కుతూ, తమ వికృత స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. భారత జాతీయ జెండా పట్ల వారు మరింత అవమానకర రీతిలో ప్రవర్తిస్తుండడం చూసిన పూనమ్ జోషి అనే ఏఎన్ఐ జర్నలిస్టు ఒక్కసారి దూసుకువెళ్లి నిరసనకారుల నుంచి భారత జాతీయ జెండాలను లాగేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.