పనిచేయని అరుణ్ జైట్లీ కిడ్నీలు... ఈసీఎంఓ అమరిక!
- గత వారం ఎయిమ్స్ లో చేరిన జైట్లీ
- కిడ్నీలతో పాటు శ్వాస సమస్యలు
- లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారన్న వైద్యులు
తనంతట తానుగా ఆయన శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతోనే, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సాధారణంగా కిడ్నీలు పనిచేయకుండా, గుండె పనితీరు మందగించిన వేళ, శ్వాస సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను అమరుస్తామని వైద్యులు తెలిపారు. జైట్లీ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారని అన్నారు. కాగా, పలువురు బీజేపీ నేతలతో పాటు, జైట్లీతో పరిచయమున్న ఎంతో మంది ఎయిమ్స్ కు చేరుకుని, జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి జైట్లీని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.