పనిచేయని అరుణ్ జైట్లీ కిడ్నీలు... ఈసీఎంఓ అమరిక!

  • గత వారం ఎయిమ్స్ లో చేరిన జైట్లీ
  • కిడ్నీలతో పాటు శ్వాస సమస్యలు
  • లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారన్న వైద్యులు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, గత వారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన రెండు కిడ్నీలూ పనిచేయడం లేదని, గుండె పనితీరు మందగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఈసీఎంఓ (ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చి, ఐసీయూలో చికిత్సను అందిస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి.

తనంతట తానుగా ఆయన శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతోనే, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సాధారణంగా కిడ్నీలు పనిచేయకుండా, గుండె పనితీరు మందగించిన వేళ, శ్వాస సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను అమరుస్తామని వైద్యులు తెలిపారు. జైట్లీ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారని అన్నారు. కాగా, పలువురు బీజేపీ నేతలతో పాటు, జైట్లీతో పరిచయమున్న ఎంతో మంది ఎయిమ్స్ కు చేరుకుని, జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి జైట్లీని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Arun Jaitly
ECMO
AIIMS
BJP
New Delhi

More Telugu News