ఆ సినిమా కోలుకోలేని దెబ్బకొట్టేసింది: అడివి శేష్
Add ap7am to your home Screen

ఆ సినిమా కోలుకోలేని దెబ్బకొట్టేసింది: అడివి శేష్

  • 'దర్శకుడిగా 'కిస్' సినిమా చేశాను
  • మైదాపిండి డబ్బులు కూడా రాలేదు 
  • రచయితగా సక్సెస్ అయ్యానన్న శేష్  
సినిమాల పట్ల గల ఇంట్రెస్ట్ తో అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదిలేసి అడివి శేష్ వచ్చాడు. ఆయన కథానాయకుడిగా తాజాగా వచ్చిన 'ఎవరు' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తనకి ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ప్రస్తావించాడు.

"దర్శకుడిగా నేను 'కిస్' అనే సినిమా చేశాను. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అప్పటివరకూ సంపాదించుకున్నదంతా ఆ సినిమాతో పోయింది. ఆ సినిమా పోస్టర్స్ అంటించడానికి ఖర్చు చేసిన మైదాపిండి డబ్బులు కూడా రాలేదు. దాంతో దర్శకత్వాన్ని పక్కన పెట్టేసి నటనపైనే పూర్తి దృష్టి పెట్టాను. ఫ్లాప్ దర్శకుడు అనిపించుకున్నా, నటుడిగాను .. రచయితగాను సక్సెస్ అయినందుకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. 'క్షణం' .. 'గూఢచారి' సినిమాలకి కథలను అందించింది నేనే' అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు.
Adivi Sesh

More Telugu News