అక్రమ సంపాదనపై జగన్ గారికి ఇంకా మోజు తీరలేదు!: నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో కేసుల్లో మునిగితేలుతున్నా, అక్రమ సంపాదనపై జగన్ కు ఇంకా మోజు తీరలేదని విమర్శించారు. సిమెంట్ కంపెనీల నుంచి జే-ట్యాక్స్ వసూళ్లు పూర్తయ్యేవరకూ ఇసుక సమస్య తీరదని లోకేశ్ స్పష్టం చేశారు.

అప్పటివరకూ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక, ఆకలితో అప్పులపాలు కావాల్సిందేనని దుయ్యబట్టారు. ప్రజల కన్నీటి చుక్కలతో తడిపితే కానీ జగన్ అక్రమాస్తుల కోటల పునాదులు బలంగా ఉండవని విమర్శించారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
Chief Minister
Nara Lokesh
Telugudesam
Twitter

More Telugu News