రాఖీ కట్టిన షర్మిల... చెల్లెమ్మకు మిఠాయి తినిపించిన సీఎం జగన్

రాఖీ పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. సంప్రదాయాన్ని అనుసరించి తన సోదరుడికి రాఖీ కట్టిన షర్మిల సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా తన సోదరి షర్మిలకు ఎంతో అనురాగంతో మిఠాయి తినిపించిన జగన్ ఓ అన్నగా మురిసిపోయారు. ఈ రాత్రికి అమెరికా వెళుతున్న జగన్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగానే షర్మిల రాఖీ కట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Go Back to Shorts
Jagan
Sharmila
Rakhi

More Telugu News