ప్రవాహంలో చిక్కుకున్న వృద్ధుడు : సాహసం చేసి కాపాడిన యువకుడు
- ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి
- నెహ్రూనగర్లోకి నీరు ప్రవేశం
- నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయిన వృద్ధుడు
వృద్ధుడిని గమనించిన ఓ యువకుడు ప్రవాహంలో ఎదురెళ్లి ఆ వ్యక్తిని కాపాడాడు. అయితే అప్పటికే నీటిలో చిక్కుకు పోవడం వల్ల వృద్ధుడి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ప్రాణాప్రాయం లేదని ప్రకటించారు. వృద్ధుడి ప్రాణాల కోసం సాహసం చేసిన యువకుడి ధైర్యాన్ని ప్రజలు కొనియాడారు.