టీడీపీ నేతలను చంద్రబాబే బీజేపీలోకి పంపించారు!: తెలంగాణ మంత్రి తలసాని
- క్యాడర్ లేని లీడర్లతో ప్రయోజనం లేదు
- బీజేపీలో కాలంతీరిన నేతలే చర్చిస్తున్నారు
- హైదరాబాద్ లో మీడియాతో టీఆర్ఎస్ నేత
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదని తలసాని తెలిపారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గాలి పనిచేసిందని తలసాని అంగీకరించారు. రాజకీయాలకు పనికిరాని కొందరు వ్యక్తులు ఆ గాలిలోనే తెలంగాణలో గెలుపొందారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నది ఊహాగానాలేనని స్పష్టం చేశారు.