అందుకే 'జబర్దస్త్' నుంచి తప్పుకోవాల్సి వచ్చింది: కమెడియన్ షేకింగ్ శేషు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే 'జబర్దస్త్' నుంచి తప్పుకోవాల్సి వచ్చింది: కమెడియన్ షేకింగ్ శేషు

  • 'జబర్దస్త్' వలన మంచి గుర్తింపు వచ్చింది 
  • డేట్స్ కుదరకపోవడం సమస్య అవుతోంది 
  • సినిమా అవకాశాలు పోతున్నాయన్న శేషు 
'జబర్దస్త్' కామెడీ షో చాలా కాలంగా మంచి రేటింగ్ తో రన్ అవుతోంది. ఈ వేదిక ద్వారా చాలామంది కమెడియన్లు పాప్యులర్ అయ్యారు. అలాంటివారి జాబితాలో షేకింగ్ శేషు ఒకరుగా కనిపిస్తాడు. ఇటీవల కాలంలో ఆయన 'జబర్దస్త్' వేదికపై కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అందుకు గల కారణాన్ని గురించి వివరించాడు.

'జబర్దస్త్' కార్యక్రమం మా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాల నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అయితే అటు సినిమాలు .. ఇటు 'జబర్దస్త్'ను చేయడం కష్టమవుతోంది. డేట్స్ కుదరకపోవడం వలన ఏదో ఒకటి వదులుకోవలసి వస్తోంది. అందువలన నేను 'జబర్దస్త్' ను వదులుకోవలసి వచ్చింది. 'రచ్చ రవి' కూడా ఈ కారణంగానే 'జబర్దస్త్'కి దూరమయ్యాడు' అని చెప్పుకొచ్చాడు.
Sheking Seshu

More Telugu News