Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రోజుల్లో 'కొబ్బరిమట్ట' వసూళ్లు రూ. 12 కోట్లు... 'తూచ్' అంటూ అసలు నిజం వెంటనే చెప్పేసిన నిర్మాత!

  • శనివారం విడుదలైన 'కొబ్బరిమట్ట'
  • అభిమానుల కోసం రూ. 9 కోట్ల అధిక కలెక్షన్స్
  • స్టార్ మార్క్ పెట్టి మరీ చెప్పిన యూనిట్
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు హీరోగా గతవారం విడుదల అయిన 'కొబ్బరిమట్ట' చిత్రం మూడు రోజుల్లోనే రూ. 12 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిందట. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా విడుదల చేసిన సినిమా నిర్మాతలు, అదే పోస్టర్ లో చిన్న అక్షరాలతో అసలు విషయాన్ని చెప్పి అవాక్కయ్యేలా చేశారు.

శనివారం నాడు రిలీజ్‌ అయిన 'కొబ్బరిమట్ట' తొలి మూడు రోజుల్లోనే రూ. 12 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్ లో కలెక్షన్ వివరాల పక్కనే ఓ స్టార్‌ మార్క్‌ కనిపిస్తూ ఉంటుంది. దానికి కాస్తంత కిందభాగంలో, ఫ్యాన్స్‌ కోసం రూ. 9 కోట్ల ఫేక్‌ కలెక్షన్లు కలిపామన్న క్లారిటీ కూడా ఉంది. అంటే ఈ సినిమా మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయలను వసూలు చేసిందన్నమాట.

'మన్మధుడు-2', 'కురుక్షేత్ర' వంటి భారీ సినిమాలు విడుదలైన సమయంలో వచ్చిన 'కొబ్బరిమట్ట' ఆ మాత్రం కలెక్షన్లు సాధించడం కూడా చెప్పుకోతగ్గ అంశమేనని ఫ్యాన్స్ అంటున్నారు.
Kobbarimatta
Collections
Sampornesh babu

More Telugu News