అమరావతిలో జగన్...కర్నూల్లో బొత్స...శ్రీకాకుళంలో వెల్లంపల్లి.. రేపు జెండా ఆవిష్కరించేది వీరే!
- జిల్లాల వారీ జాబితా విడుదల చేసిన సర్కారు
- స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు
- అధికారంలోకి వచ్చాక తొలి పండుగ
దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసే వారి జాబితాను సర్కారు విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు జెండా ఆవిష్కరిస్తారు. అలాగే ప్రకాశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో మంత్రి సుచరిత, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశాఖలో మంత్రి మోపిదేవి, గుంటూరులో మంత్రి పేర్ని నాని జెండా ఎగురవేయనున్నారు.