భూకక్ష్యను దాటిన చంద్రయాన్-2.. చంద్రుడివైపు పరుగులు
- గత నెల 22న చంద్రయాన్-2 ప్రయోగం
- ఈ ఉదయం కీలక ప్రక్రియను చేపట్టిన ఇస్రో
- ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 22న చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న వ్యోమనౌక వచ్చే నెల 7న చంద్రుడిపై కాలు మోపనుంది. భూ కక్ష్యను దాటించేందుకు ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.