Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగులో కమలహాసన్ నా జడ కట్ చేశాడు: సీనియర్ నటి సుమిత్ర

  • రజనీకి మొహమాటం ఎక్కువ 
  • కమల్ అందరినీ ఆటపట్టించేవాడు
  • వాళ్లతో నటించడం మరిచిపోలేని జ్ఞాపకం
వెండితెరపై ఇప్పటికీ ఒక వెలుగు వెలుగుతోన్న రజనీకాంత్, కమలహాసన్ లతో సుమిత్ర కొన్ని చిత్రాలలో కథానాయికగా నటించారు. ఆ ఇద్దరితో హీరోయిన్ గా చేసినప్పటి సంగతులను గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుమిత్ర ప్రస్తావించారు. తమిళంలో రజనీకాంత్ జోడీగా అది నాకు తొలి సినిమా. అప్పటికే నాకు హీరోయిన్ గా మంచి క్రేజ్ వుంది. అందువలన రజనీ నాకు దూరం దూరంగా తిరుగుతూ ఉండేవాడు.

'రజనీ .. ఇలా వచ్చి కూర్చోండి' అని అంటే, 'నాకు ఇక్కడే కంఫర్టుగా వుందండి' అంటూ మొహమాటపడుతూ చెప్పేవాడు. అలాంటి హీరోని ఇప్పుడు చూడలేము. ఇక షూటింగులో కమల్ చాలా అల్లరి చేసేవాడు. ఓ రోజు సెట్లో ఉండగా నా వెనక కూర్చుని నాకు తెలియకుండా 'జడ' కట్ చేశాడు. ఆ తరువాత నా జడ చూసుకుని నేను ఘొల్లు మన్నాను. అందరినీ ఆయన ఇలా ఆటపట్టిస్తూనే ఉండేవాడు. ఆ ఇద్దరితో  నటించడం ఒక మరిచిపోలేని జ్ఞాపకం " అని చెప్పుకొచ్చారు. 
Sumitra
Ali

More Telugu News