కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారు: అమెరికాలో భారత రాయబారి
- చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా పాలసీ చెబుతోంది
- మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదు
- మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేసింది
మరోవైపు, కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఎలాంటి ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్దన్ శ్రింగ్లా తెలిపారు. ఇండియా-పాకిస్థాన్ లు చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని దశాబ్దాల నాటి అమెరికా పాత పాలసీ చెబుతోందని... మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదని అన్నారు. మధ్యవర్తిత్వానికి తాము ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేయడంతో... మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. లాహోర్ డిక్లరేషన్, సిమ్లా ఒప్పందం మేరకు ఇరు దేశాలు కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ చెప్పారని అన్నారు.