సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో చిత్రానికి ఓకే చెప్పిన కీర్తి సురేశ్
- ప్రభాస్ 'సాహో' కోసం అదనపు ఆటలు
- 'సరిలేరు నీకెవ్వరు'లో ట్రైన్ ఎపిసోడ్
* సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన 'సాహో' చిత్రం విడుదలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాలలో అదనపు మార్నింగ్ షోలు వేసుకోవడానికి చిత్ర నిర్మాతలు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతున్నారు. త్వరలోనే అనుమతి రావచ్చని తెలుస్తోంది.
* మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఓ ట్రైన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. అన్నపూర్ణా స్టూడియోలో వేసిన రైలు సెట్లో మహేశ్ సహా ప్రధాన తారాగణం పాల్గొనగా ఈ ఎపిసోడ్ ను పూర్తిచేశారు. ఇది కడుపుబ్బా నవ్వించే కామెడీతో సాగుతుందని అంటున్నారు.