Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పక్షి రెట్టకు, డ్రగ్స్ కు తేడా తెలియక ఫుట్ బాల్ ప్లేయర్ ను అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు

  • అమెరికాలో ఘటన
  • కారులో వేగంగా వెళుతున్న విద్యార్థిని ఆపిన పోలీసులు
  • కారు బాయ్ నెట్ పై తెల్లని పదార్థం
  • డ్రగ్స్ గా భావించి విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలోని అత్యంత ప్రాచీన నగరాల్లో సవన్నా ఒకటి. ఇది జార్జియా రాష్ట్రంలో ఉంది. సాధారణంగా అమెరికా పోలీసులు డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే, జార్జియాలో కొందరు పోలీసులు పిట్ట రెట్టకు, డ్రగ్స్ కు తేడా తెలియక పొరబాటున ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ను అరెస్ట్ చేశారు. సవన్నా సిటీలో జరిగిందీ ఘటన.

షాయ్ వెర్ట్స్ (21) అనే కుర్రాడు జార్జియా సదరన్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు యూనివర్శిటీ సాకర్ టీమ్ సభ్యుడు కూడా. అయితే, గత నెలలో షాయ్ వెర్ట్స్ కారులో వేగంగా వెళుతుండగా క్లింటన్ ప్రాంతంలో అతడిని పోలీసులు నిలువరించారు. ఆపై కారును తనిఖీ చేస్తుండగా, బాయ్ నెట్ పై తెల్లని పదార్థం కనిపించింది. దాన్ని మాదకద్రవ్యంగా భావించిన పోలీసులు వెర్ట్స్ పై నార్కోటిక్ కేసు నమోదు చేశారు. పోలీసు కేసు నేపథ్యంలో వర్శిటీ కూడా అతడిపై వేటు వేసింది.

చివరికి కోర్టులో కానీ అసలు విషయం తేలలేదు. ఆ తెల్లని పదార్థం పక్షి రెట్ట తప్ప మరొకటి కాదని, కావాలంటే పరీక్షించుకోవాలని వెర్ట్స్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దాంతో పరీక్ష నిర్వహించగా అది డ్రగ్ కాదని తేలింది. దాంతో అధికవేగం అభియోగాలపై మాత్రమే జరిమానా విధించారు. తమ క్రీడాకారుడు నిర్దోషి అని తేలడంతో యూనివర్శిటీ మళ్లీ అతడికి స్వాగతం పలికింది.
Police
USA

More Telugu News