జగన్ గారు స్కామ్ స్టార్ అని ఆధారాలతో రుజువైంది: నారా లోకేశ్

  • వలంటీర్ల నియామకం ఓ పెద్ద కుంభకోణం అంటూ విమర్శలు చేసిన లోకేశ్
  • వలంటీర్ల స్కామ్ తో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తున్నారని ఆరోపణ
  • 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ఈ కుంభకోణం అని ధ్వజం
గ్రామ వలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అని, వలంటీర్ల నియామకం పేరుతో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆరోపించారు. 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగులను తీసేసి వారి కడుపు మీద కొట్టే కుట్రే వలంటీర్ల కుంభకోణం అని లోకేశ్ విమర్శించారు. వలంటీర్ల నియామకంలో కులాలు, మతాలు చూడడంలేదని, సదరు అభ్యర్థి వైసీపీ కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూస్తామని స్వయంగా ప్రకటిస్తున్నారంటూ మండిపడ్డారు. తద్వారా జగన్ గారు ఓ స్కామ్ స్టార్ అని ఆధారాలతో నిరూపితమైందని ధ్వజమెత్తారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామ వలంటీర్ల నియామకం ఉంటుందని జగన్ గారు ఆస్కార్ అవార్డుల స్థాయిలో నటిస్తుంటే, అసలు నిజాన్ని కడుపులో దాచుకోలేక దొంగ లెక్కల వీరుడు కుంభకోణాన్ని బయటికి కక్కేశారంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతున్న వీడియోను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News