మా ఎమ్మెల్యేలను గెలిపించని ప్రాంతాలకు రూపాయి కూడా ఇవ్వమన్న సిగ్గులేని చరిత్ర చంద్రబాబుది!: విజయసాయిరెడ్డి
- ఇలాంటి చౌకబారు విమర్శలు బాబుకే సాధ్యం
- జగన్ హుందాతనం ఆయనకు ఎన్నటికీ రాదు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
మరోవైపు వైసీపీ నేతలకు సిమెంట్ బస్తాకు రూ.5 చొప్పున కంపెనీల నుంచి డిమాండ్ చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ చెప్పడంపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఎంత దిగజారావు ఉమా? ఊహాకల్పనలకు కూడా ఒక హద్దుండాలి. సిమెంటు కంపెనీలు బస్తాకు రూ.5 ఇవ్వనందుకే ఇసుక సరఫరాను ఆపేశామా? నీతో సహా ఇసుక బకాసురులు పదివేల మంది ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలేయక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారు అనే కదా నీ బాధ?’ అని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.