అయ్యా జగన్ గారూ.. ‘మీసేవ’ను రద్దు చేస్తున్నారట.. నిజమేనా?: టీడీపీ నేత వర్ల రామయ్య
- ఇలాంటి విపరీత నిర్ణయాలు ఎందుకు?
- మీ పాలన రద్దుల పాలనగా మారింది
- గ్రామ వాలంటీర్లే అన్నీ చేస్తారని చెప్పడం మోసగించడమే
జగన్ 73 రోజుల పరిపాలన ‘రద్దుల పాలన’గా పేరు గాంచిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే ‘మీ సేవ’ను రద్దు చేయవద్దని వర్ల రామయ్య కోరారు. ప్రతీ పనిని గ్రామ వాలంటీర్లే చూసుకుంటారని చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.