హరియాణా మాజీ సీఎం భార్య కన్నుమూత
- ఆదివారం రాత్రి కన్నుమూసిన ఓం ప్రకాశ్ చౌతాలా భార్య
- నేడ స్వగ్రామంలో అంత్యక్రియలు
- ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న చౌతాలా
తల్లి మృతి చెందిన వార్త తెలిసినప్పుడు ఆమె కుమారుడు అభయ్ చౌతాలా ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహలతను ఈ ఏడాది జనవరిలో ఆసుపత్రిలో చేర్చారు. కోలుకోవడంతో కొన్ని రోజులకే ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇటీవల మళ్లీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. నేడు హరియాణాలోని చౌతాలా స్వగ్రామంలో స్నేహలత అంత్యక్రియలు జరగనున్నాయి.