కొత్త ఇసుక విధానం రాకముందే వైసీపీ నేతలను కుబేరులను చేయాలని చూస్తోంది: టీడీపీ నేతల విమర్శలు
- ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు!
- సిమెంట్ కంపెనీలతో లాలూచీ కుదరదంటూనే ఇసుక అందకుండా చేస్తున్నారు
- ఈ ప్రభుత్వం త్వరలో మీ సేవా కేంద్రాలకూ మంగళం పాడాలనుకుంటోంది
ఈ రద్దుల ప్రభుత్వం త్వరలో మీ సేవా కేంద్రాలకు కూడా మంగళం పాడాలనుకుంటోందని, ఇప్పటికే వేలాది ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా సహకార సంఘాల ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, గ్రామీణ స్థాయిలో సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో వైసీపీ కార్యకర్తలకు సహకార సంఘాల బాధ్యతలు అప్పగింత తగదని అన్నారు.
విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఆవులు ఆనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు. గోశాలలో పెద్ద సంఖ్యలో మూగజీవాల మరణం బాధాకరమని, ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని, గోవుల పోస్టుమార్టం నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.