50 ఏళ్ల క్రితం చోరీ అయిన వెండి కిరీటం.. చిత్తుకాగితాల్లో లభ్యం!
- 1955లో వెండి కిరీటాన్ని తయారుచేయించిన రాచకొండ గోపాలకృష్ణయ్య దంపతులు
- చంద్రశేఖరస్వామి ఆలయానికి బహూకరణ
- 1968లో కిరీటం చోరీ
1955లో 300 గ్రాముల వెండితో రాచకొండ గోపాలకృష్ణయ్య- వెంకటసుబ్బమ్మ దంపతులు ఈ కిరీటాన్ని చేయించినట్టు కిరీటంపై రాసి ఉంది. దీనిని వారు ఆలయానికి బహూకరించారు. 1968లో ఈ కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అది ఏమైందన్నది తెలియరాలేదు. తాజాగా చిత్తుకాగితాలు ఏరుకునే వారికి దొరికింది. దీనిని స్వాధీనం చేసుకున్న పోలీసులు చంద్రశేఖరస్వామి ఆలయ ఈవోకు అందజేశారు.