ఇస్ట్రీ పెట్టెల్లో బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

  • దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు
  • నాలుగు ఇస్త్రీపెట్టెల్లో 9.2 కిలోల బంగారం అక్రమ రవాణా
  • బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా 9.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు 4 ఇస్త్రీ పెట్టెల్లో బంగారం దాచి రవాణా చేస్తుండడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Go Back to Shorts
Gold
Iron Box
Airport
Hyderabad

More Telugu News