ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి ఆయిల్ తెచ్చుకునే ప్రయత్నంలో ఘోరం... 62 మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి ఆయిల్ తెచ్చుకునే ప్రయత్నంలో ఘోరం... 62 మంది మృతి

  • టాంజానియాలో విషాదం
  • పెట్రోల్ తెచ్చుకునేందుకు వెళ్లి సిగరెట్ అంటించిన వ్యక్తి
  • ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలిపోయిన ట్యాంకర్
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన ఓ ట్యాంకర్ నుంచి ఆయిల్ ను తెచ్చుకోవడానికి వెళ్లిన వ్యక్తులు అక్కడ జరిగిన పేలుడు కారణంగా సజీవ దహనమయ్యారు. వీరిలో అత్యధికులు స్థానిక ట్యాక్సీ డ్రైవర్లని తెలుస్తోంది.

టాంజానియాలోని మొరొగొరో ప్రాంతంలో ఓ పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దాంతో ఆ ట్యాంకర్ నుంచి ఆయిల్ ను తెచ్చుకునేందుకు స్థానికులు పోటీలు పడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ట్యాంకర్ విస్ఫోటనం చెందడంతో 62 మంది దుర్మరణం పాలయ్యారు. దీనికంతటికీ కారణం ఓ వ్యక్తి సిగరెట్ అంటించడమే!

అతడు కూడా పెట్రోల్ తీసుకెళ్లడానికి వచ్చి అలవాటుగా సిగరెట్ వెలిగించడంతో మంటలు చెలరేగి ట్యాంకర్ వరకు వ్యాపించాయి. దాంతో ట్యాంకర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఇప్పటివరకు గుర్తించింది 62 మృతదేహాలనే. ఇంకా కొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Tanzania
Oil
Tanker
Road Accident

More Telugu News