ఎయిమ్స్ లో జైట్లీని పరామర్శించిన మోదీ, అమిత్ షా

  • అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన అరుణ్ జైట్లీ
  • శ్వాస సంబంధిత, గుండె, కిడ్నీల సమస్యలు 
  • జైట్లీ ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్న మోదీ, అమిత్ షా
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమధ్య ఆయన మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శ్వాస సంబంధ సమస్యతో పాటు, గుండె, కిడ్నీల సమస్యలతో ఆయన ఈ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. జైట్లీని కుటుంబ సభ్యులు వీల్ చెయిర్ లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ సహచరుడ్ని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్ కు వచ్చారు. జైట్లీ కుటుంబ సభ్యులను, డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Arun Jaitly
Narendra Modi
Amit Shah
AIIMS
New Delhi

More Telugu News