Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో ఆడవాళ్లు నాపై చాలా కోపంగా వుండేవాళ్లు: కైకాల సత్యనారాయణ

  • విలన్ గా చాలా సినిమాలు చేశాను 
  • కొన్ని పాత్రలు ఆడవాళ్లు మరిచిపోలేదు
  •  ఓ పబ్లిక్ ఫంక్షన్లో తిట్టేశారన్న కైకాల     
తెలుగు తెరపై తిరుగులేని ప్రతినాయకుడిగాను .. క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. నవరస నట సార్వభౌముడిగా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అప్పట్లో విలన్ గా చాలా సినిమాల్లో చేశాను .. ఆ పాత్రల్లో ఆడవాళ్లను హింసించేవి కూడా వున్నాయి. దాంతో ఆడవాళ్లకు నాపై చాలా కోపంగా ఉండేది.

ఒకసారి ఒక పబ్లిక్ ఫంక్షన్ కి వెళితే ఒకావిడ 'ఈ సత్తిగాడిని వెనక నుంచి పొడిచేయాలి' అందట. మరొకావిడ 'ఆడపిల్ల జీవితాలను ఎందుకయ్యా అట్లా నాశనం చేస్తావు .. నీకు అక్కా చెల్లెళ్లు లేరా?' అని అడిగిందట. ఒక విలన్ ను ప్రేక్షకులు తిట్టుకుంటే అతను ఆ పాత్రను బాగా చేసినట్టే. అందుకే వాళ్లు అలా అన్నందుకు నేను బాధపడకుండా నవ్వుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Kaikala

More Telugu News