Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. ముక్కు కోసేసిన అత్తామామలు!

  • ఫిర్యాదును వెనక్కి తీసుకోమని బలవంతం
  • నిరాకరించడంతో ముక్కు కోసిన అత్తమామలు
  • ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘటన
ముమ్మారు తలాక్ చెప్పిన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన అత్తమామలు ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె ముక్కును కోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిందీ ఘటన. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ కేంద్రం ఇటీవలే చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తలాక్ చెప్పి భార్యను వదిలించుకున్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

చట్టం అమల్లోకి వచ్చినా తలాక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సీతాపూర్‌లో జరిగిన ఘటన మరింత శ్రుతిమించింది. భర్త తనకు ఫోన్‌లో తలాక్ చెప్పాడంటూ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలిసిన భర్త కుటుంబ సభ్యులు ఇంటికొచ్చిన ఆమెపై దాడిచేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసేశారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు మాట్లాడుతూ.. ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి మాట్లాడామని తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాధిత మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.
tripple talaq
Uttar Pradesh
sitapur
Nose

More Telugu News