ఆపదలో ఉన్న అమ్మాయి... క్యాబ్ ను బుక్ చేసి, డ్రైవర్ ను బాయ్ ఫ్రెండ్ గా నటించాలని కోరిన వేళ..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆపదలో ఉన్న అమ్మాయి... క్యాబ్ ను బుక్ చేసి, డ్రైవర్ ను బాయ్ ఫ్రెండ్ గా నటించాలని కోరిన వేళ..!

  • అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఘటన
  • వ్యక్తి వెంటపడుతున్నాడని క్యాబ్ డ్రైవర్ కు చెప్పిన యువతి
  • ఆమె కోసం క్యాబ్ స్టిక్కర్లు తీసేసి బాయ్ ఫ్రెండ్ గా నటించిన డ్రైవర్
  • ఫేస్ బుక్ లో స్టోరీ వైరల్
తాను ఆపదలో ఉన్నానని గమనించిన ఓ అమ్మాయి, క్యాబ్ ను బుక్ చేసుకుని, అతన్ని తన బాయ్ ఫ్రెండ్ గా నటించాలని కోరింది. అలా చేస్తే, తనను ఏదో చేయాలని అనుకుంటున్న వారు భయపడి వెనక్కు వెళతారని ఆమె భావించింది. ఆ తరువాత ఏం జరిగింది?... ఈ స్టోరీ ఇప్పుడు  వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే...

యూఎస్ లోని ఇల్లినాయిస్ లో బ్రాండన్ గిల్, ఉబర్ క్యాబ్ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను ఖాళీగా ఉన్నవేళ, సమీపంలో ఒకరు క్యాబ్ కోసం చూస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ బుకింగ్ ను తీసుకున్న బ్రాండన్, కారును స్టార్ట్ చేశాడు. ఈలోగానే కారును బుక్ చేసుకున్న యువతి నుంచి ఫోన్ మెసేజ్ వచ్చింది.

తన వద్దకు వచ్చే సమయంలో ఉబెర్ కారులో డ్రైవర్ మాదిరిగా కాకుండా, ఓ బాయ్ ఫ్రెండ్ లా రావాలన్నదే ఆ మెసేజ్. దీంతో బ్రాండన్ ఫోన్ చేసి, ఏం జరిగిందని అడిగాడు. తన వెనుక ఓ వ్యక్తి వెంట పడ్డాడని, ఎక్కడికి వెళితే, అక్కడికి వస్తున్నాడని, తప్పించుకునేందుకు ఇంతకన్నా మరో మార్గం కనబడలేదని ఆమె చెప్పింది.

ఆమె మాటలకు కన్విన్స్ అయిన బ్రాండన్, తన కారుపై ఉన్న ఉబెర్ స్టిక్కర్ తీసేశాడు. తన వేలికి ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్ ను తీసి జేబులో పెట్టుకున్నాడు. బాయ్‌ ఫ్రెండ్‌ లా నటిస్తూ, అమ్మాయి దగ్గరికి వెళ్లి, ఆమెను క్షేమంగా ఇంట్లో దింపేశాడు. తనకు ఎదురైన ఆ అనుభవాన్ని, ఫేస్‌ బుక్‌ లో అతను పంచుకోవడంతో అది వైరల్ అయింది. ఎంతో మంచి పని చేశావని బ్రాండన్ పై పొగడ్తల వర్షం కురుస్తోంది ఇప్పుడు.
USA
Illinois
Cab
Driver
Boy Friend

More Telugu News