ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరిన జగన్

  • వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలి
  • అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రాంట్లు ఇవ్వండి
  • కేంద్ర మంత్రులను కోరిన జగన్
ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన ఏపీ ముుఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతి-అనంతపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలని, కొత్త రహదారుల నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
New Delhi
nirmala sitaraman

More Telugu News