'తలైవి' మొదలయ్యేది అప్పుడేనట!
- జయలలిత బయోపిక్ కి సన్నాహాలు
- ప్రధాన పాత్రధారిగా కంగనా రనౌత్
- అక్టోబర్ మొదటివారంలో షూటింగ్ మొదలు
జయలలిత పాత్ర కోసం కంగనా రనౌత్ ను తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను గురించి నిర్మాతలలో ఒకరైన శైలేష్ ఆర్ సింగ్ మాట్లాడుతూ .. "ప్రస్తుతం కంగనా తమిళ డిక్షన్ లోను .. క్లాసికల్ డాన్స్ లోనూ శిక్షణ పొందుతోంది. సాంకేతిక నిపుణులు అందరూ ఆన్ బోర్డులోకి వచ్చేశారు. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాము. మైసూరులో షూటింగు మొదలై, చెన్నైలో కంటిన్యూ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.