అదే జరిగితే గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుంటా: సోనియా విషయంలో సుష్మ నాటి శపథం
- 1999లో బళ్లారిలో సోనియాపై పోటీ
- 56 వేల ఓట్ల తేడాతో ఓటమి
- సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న వైనం
1999 తర్వాత కూడా సోనియాగాంధీ-సుష్మా స్వరాజ్ మధ్య రాజకీయ వైరం కొనసాగింది. 2004 ఎన్నికల్లో యూపీయే ఘన విజయం సాధించింది. అయితే, సోనియా కనుక ప్రధాని పీఠాన్ని అధిష్ఠిస్తే తాను గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుని నిరసన తెలుపుతానని సుష్మ హెచ్చరికతో కూడిన శపథం చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. బ్రిటిషర్ల పాలన ముగిసినా దేశాన్ని ఇంకా విదేశీయులు పాలించడం తనకు సమ్మతం కాదని తేల్చి చెప్పారు. అయితే, కారణాంతరాల వల్ల సోనియా ప్రధాని పదవిని చేబట్టని విషయం మనకు తెలిసిందే!