వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  • మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
  • అక్కడక్కడ భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారగా, ఇప్పుడది వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయని వివరించారు.
Go Back to Shorts
Bay Of Bengal
Andhra Pradesh
Telangana

More Telugu News