ప్రధాని కార్యాలయ అధికారులతో భేటీ అయిన జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని కార్యాలయ అధికారులతో భేటీ అయిన జగన్

  • ఏపీకి రావాల్సిన నిధులపై చర్చిస్తున్న సీఎం
  • కాసేపట్లో మోదీతో భేటీ
  • అనంతరం పార్లమెంటుకు వెళ్లి అమిత్ షాను కలవనున్న జగన్
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ కార్యాలయ అధికారులతో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులపై అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలు పెండింగ్ విషయాలపై ఈ సందర్భంగా మోదీతో జగన్ చర్చించనున్నారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై సమీక్ష, పోలవరం ప్రాజెక్టులో రీటెండరింగ్ తదితర విషయాలను మోదీకి వివరించనున్నారు. అనంతరం పార్లమెంటుకు వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. జగన్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Jagan
Modi
Amit Shah
Delhi

More Telugu News