మేము అంతా చూసుకుంటాం.. నీవు కంగారు పడకు: అఫ్రిదీకి గౌతం గంభీర్ కౌంటర్
- ఆర్టికల్ 370 రద్దుపై మండిపడ్డ అఫ్రిది
- ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందంటూ వ్యాఖ్య
- అరాచకాలన్నీ పీఓకేలోనే జరుగుతున్నాయన్న గంభీర్
అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. మానవ హక్కుల హననం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే జరుగుతోందని అన్నాడు. మానవ హక్కుల గురించి అఫ్రిది మాట్లాడటం చాలా సంతోషకరమని... అయితే, మానవ హక్కుల హననం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని సెటైర్ వేశాడు. అఫ్రిది కంగారు పడాల్సిన అవసరం లేదని... అన్ని విషయాలను తాము చూసుకుంటామని చెప్పాడు.