Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖుష్బూ అభిమాని నన్ను రాయితో కొట్టింది: నటుడు రాజా రవీంద్ర

  • తమిళంలో 'పురుష లక్షణం' సినిమా చేశాను 
  • నాది ఖుష్బూ ను టార్చర్ చేసే విలన్ పాత్ర
  • అక్కడి జనానికి తనపై కోపం వచ్చేసిందన్న రాజారవీంద్ర 
అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై నటుడిగా రాజారవీంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. "తమిళంలో నేను 'పురుష లక్షణం' అనే సినిమా చేశాను. ఆ సినిమాలో హీరోయిన్ ఖుష్బూ అయితే నేను విలన్. తమిళనాడులో ఖుష్బూకి గుడికట్టిన కొత్తలో ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమాలో నేను ఖుష్బూని ఎంతగానో వేధిస్తాను. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. నా పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. ఆ తరువాత కొన్ని రోజులకి నేను చేస్తోన్న మరో సినిమా షూటింగ్ అక్కడి బీచ్ లో జరుగుతోంది. 'పురుష లక్షణం' సినిమాలో నేను ఖుష్బూను ఏడిపించాననే కోపంతో ఒకావిడ నన్ను రాయి పెట్టి కొట్టింది. దెబ్బ తగిలినా నేను బాధ పడలేదు .. ఆ పాత్ర అంత బాగా చేశాననుకుని సంతోషపడ్డాను" అని చెప్పుకొచ్చాడు.
Raja Raveendra
Khushboo

More Telugu News