నేడు లోక్ సభ ముందుకు ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన బిల్లులు
- నిన్న రాజ్యసభలో గట్టెక్కిన బిల్లులు
- లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ
- దిగువ సభలో బిల్లులు గట్టెక్కడం నల్లేరు మీద నడకే
రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు కోసం ఓటింగ్ నిర్వహించగా... ఆర్టికల్ రద్దుకు అనుకూలంగా 125 ఓట్లు పడ్డాయి. 61 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న రాజ్యసభలో తెలిపారు.