ఆర్యా... చంద్రబాబు మీదే కాదు, ఆయన వేసిన రంగుల మీద కూడా కోపమా?: వర్ల రామయ్య

  • అన్న క్యాంటీన్లు ఆపేసిన వైసీపీ సర్కారు
  • టీడీపీ నేతల ఆగ్రహం
  • అన్న క్యాంటీన్లకు రూ.11 కోట్ల ఖర్చుతో రంగులెందుకు వేశారంటూ నిలదీసిన వర్ల
టీడీపీ నేత వర్ల రామయ్య మరోమారు వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్యా... అన్న క్యాంటీన్లు కొనసాగించే ఉద్దేశం లేనప్పుడు వాటికి రంగులు మార్చడానికి రూ.11 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలి అంటూ ట్విట్టర్ లో నిలదీశారు. ఇది వృథా ఖర్చు కాదని ప్రజలకు చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. అయినా చంద్రబాబు మీదే కాకుండా, ఆయన వేసిన రంగుల మీద కూడా కోపమా? ఇదేనా రాజన్న రాజ్యం అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ సర్కారు నిలుపుదల చేయడం, వాటికి కొత్త రంగులు వేయడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
Jagan
Telugudesam
YSRCP
Anna Canteen

More Telugu News