రీతూవర్మకి కాలం కలిసొచ్చినట్టే

  • 'పెళ్లిచూపులు'తో తెలుగు తెరకి పరిచయం
  • దుల్కర్ 25వ సినిమాలో దక్కిన ఛాన్స్ 
  • వెతుక్కుంటూ వస్తోన్న వరుస అవకాశాలు
 'పెళ్లి చూపులు' సినిమా ద్వారా తెలుగు తెరకి రీతూ వర్మ పరిచయమైంది. తొలి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆమె తొందరపడి ఎక్కువ సినిమాలను అంగీకరించలేదు. ఓకే చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో, ఆమె తన దృష్టిని మలయాళ సినిమాలపై పెట్టింది. ఆమె ప్రయత్నం ఫలించి దుల్కర్ సల్మాన్ జోడీగా 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్' సినిమాలో అవకాశం లభించింది.

దుల్కర్ 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశింగ్ పెరియసామి తెరకెక్కించిన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లోను విడుదల చేయనున్నారు. తెలుగులో 'కనులు కనులను దోచాయంటే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రీతూ వర్మకి వరుస అవకాశాలు వస్తున్నాయట. ఈ సినిమాతో రీతూకి హిట్ దక్కినట్టేననీ, ఆమెకి కాలం కలిసొచ్చినట్టేననే టాక్ అక్కడ వినిపిస్తోంది. 
Go Back to Shorts
Ritu varma
Dulquer salman

More Telugu News