బిగ్‌బాస్-3: ఎలిమినేషన్ లో జాఫర్ బయటికి

  • ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేట్ అయిన జాఫర్
  • హౌస్‌లోకి వచ్చాక తన అభిప్రాయం మారిందన్న యాంకర్
  • మరోసారి అవకాశం వస్తే వెళ్తానన్న జాఫర్
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. గత వారం నటి హేమ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, ఈ వారం టీవీ9 యాంకర్ జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్‌లో ఉన్న అందరికంటే జాఫర్‌కే తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటకు వెళ్లకతప్పలేదు. రాహుల్, మహేశ్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా శెరు, పునర్నవి, శ్రీముఖి, హిమజ ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా, వీరందరూ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు.

బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు ఉంటాయని చెప్పిన జాఫర్.. మళ్లీ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా? అన్న నాగార్జున ప్రశ్నకు వెళ్తానని సమాధానం ఇచ్చాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక నాగార్జునతో కలిసి వేదికపై మాట్లాడిన జాఫర్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రెండు రోజుల వరకు ఇదంతా స్క్రిప్టు ప్రకారం జరుగుతోందని భావించానన్నాడు. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం నిజం కాదని తెలిసిందన్నాడు.
Go Back to Shorts
Bigboss
star maa
reality show
tv9
jaffar

More Telugu News