గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళన చెందొద్దు: ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- వరద గుప్పిట్లో నదీ తీరంలోని గ్రామాలు
- జలదిగ్బంధంలో దేవీపట్నం మండలం
- వరద బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం: ఉపముఖ్యమంత్రి
తూర్పు గోదావరి జిల్లాలో 5 వేల మందికి, పశ్చిమ గోదావరిలో 8 వేల మందికి వరద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు 14.3 అడుగులకు చేరింది. 13.45 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.