వైఎస్ జగన్ గారు విన్నది, చూసింది ఇదేనా?: నారా లోకేశ్

  • అన్న క్యాంటీన్ల నిలిపివేతపై టీడీపీ నేతల ఆగ్రహం
  • ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్
  • క్యాంటీన్లలో పనిచేసే కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారంటూ ట్వీట్
ఏపీ సర్కారు అన్న క్యాంటీన్లను నిలిపివేయడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతోంది నిరుపేదలు మాత్రమే కాదని, ఆ క్యాంటీన్లలో పనిచేసే కార్మికులు సైతం ఉపాధి కోల్పోయి కష్టాల పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్న వైఎస్ జగన్ గారు విన్నది, చూసింది ఇదేనా? అని ప్రజలు నిలదీస్తున్నారంటూ లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవా? అంటూ ఓ సామాన్య మహిళ నిగ్గదీసి అడుగుతున్న ఓ వీడియోను కూడా జత చేశారు.

Go Back to Shorts
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Anna Canteen

More Telugu News