పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • ఈ నెల 4న రాజమండ్రి రాక
  • పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం
  • కేన్సర్ తో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 4,5 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండ మీదుగా భీమవరం వెళతారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ముఖ్యంగా, ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
West Godavari District

More Telugu News