మహేశ్ పుట్టినరోజున 'సరిలేరు నీకెవ్వరు' ఫస్టులుక్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ పుట్టినరోజున 'సరిలేరు నీకెవ్వరు' ఫస్టులుక్?

  • షూటింగు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు తాజా చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ నెల 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇటీవల కాలంలో దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అందువల్లనే కొంతమంది సీనియర్ దర్శకుల ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టేసి మహేశ్ బాబు ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం మరో విశేషం. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 
Mahesh Babu
Rashmika

More Telugu News