అమల, సమంతలను బిగ్ బాస్ కు పంపించి డబ్బులు సంపాదించుకోండి: నాగార్జునపై శ్వేతారెడ్డి ఫైర్

  • నాగార్జునకు సామాజిక బాధ్యత లేదు
  • బిగ్ బాస్ పై ఆరోపణలకు ఎందుకు స్పందించడం లేదు?
  • నాగార్జున దొంగలా దాక్కుంటున్నారు
ప్రముఖ సినీ నటుడు, బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్ నాగార్జునపై టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆమె మాట్లాడుతూ, నాగార్జునకు సామాజిక బాధ్యత లేదని మండిపడ్డారు. నాగార్జున భార్య అమల జంతువుల సంరక్షణ కోసం స్పందిస్తున్నారని... బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు ఆరోపిస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. 'మన్మథుడు2' సినిమా ప్రమోషన్ కోసం ఆసక్తి చూపుతున్న నాగార్జున... తమ ఆరోపణలపై స్పందించకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. టాస్క్ ల పేరిట బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.

దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. వారిద్దరినీ బిగ్ బాస్ షోకు పంపి డబ్బులు సంపాదించుకోవాలని అన్నారు. నాగార్జున దొంగలా దాక్కుంటున్నారని... తప్పు చేయకపోతే బయటకు వచ్చి స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు కదా అంటూ విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Nagarjuna
Swetha Reddy
Amala
Samantha
Bigg Boss

More Telugu News