ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం... అల్లకల్లోలంగా సముద్రం
- ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
- ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించిన ఆర్టీజీఎస్
ముఖ్యంగా, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 5 వరకు తీరప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సామాన్య ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు.