భర్త నుంచి విడిపోతున్న మరో బాలీవుడ్ నటి
Add ap7am to your home Screen

భర్త నుంచి విడిపోతున్న మరో బాలీవుడ్ నటి

  • సాహిల్ సంఘాను ప్రేమించి, పెళ్లాడిన దియా మీర్జా
  • విడిపోవాలని నిర్ణయించుకున్న జంట
  • స్నేహితుల్లా ఉంటామని చెప్పిన దియా
బాలీవుడ్ కు చెందిన మరో నటి తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతోంది. తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు సీనియర్ హీరోయిన్ దియా మీర్జా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వ్యాపారవేత్త సాహిల్ సంఘాతో చాలా కాలంపాటు ప్రేమాయణం సాగించిన తర్వాత... 2014లో అతన్ని దియా పెళ్లాడింది. ఐదేళ్లు కూడా గడవక ముందే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి పిల్లలు లేరు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దియా మీర్జా స్పందిస్తూ, 11 ఏళ్ల నుంచి తాము కలిసున్నామని, కష్టసుఖాలను పంచుకున్నామని తెలిపింది. అయితే, ఇద్దరి ప్రయాణాలు విభిన్న మార్గాల్లో వెళుతుండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. విడిపోయినా, ఎప్పటి మాదిరే మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపింది. ఈ సమయంలో తమకు ఏకాంతతను కల్పిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది. ఈ విషయంపై ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని తెలిపింది.
Dia Mirza
Divorce
Bollywood

More Telugu News