వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన 42 విద్యుత్ సంస్థలు
- విద్యుత్ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసిందన్న విద్యుత్ సంస్థలు
- పిటిషనర్లలో టాటా రెన్యువబుల్, వాల్ వాహన్
- తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
పిటిషన్లు దాఖలు చేసిన సంస్థల్లో టాటా రెన్యువబుల్, వాల్ వాహన్ లు కూడా ఉన్నాయి. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్ లో విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ పిటిషన్లు ఈరోజు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ నెల 22న అనుబంధ పిటిషన్లు ఉన్న కారణంగా అదే రోజున విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది.