వైసీపీ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తున్నాం: పవన్ కల్యాణ్
- గడువు తర్వాత ప్రభుత్వ పాలనపై స్పందిస్తామన్న జనసేనాని
- మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశం
- ఇసుక లేక జనసేన కార్యాలయ నిర్మాణం ఆగిపోయిందంటూ వెల్లడి
రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందని, చివరికి జనసేన కార్యాలయ నిర్మాణం కూడా ఇసుక లేకపోవడం వల్ల నిలిచిపోయిందని తెలిపారు. అంతేగాకుండా, ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ తమతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే తాము ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకోవడంతో వారితో పొత్తు పెట్టుకోలేదని వివరించారు.