'మన్మథుడు 2' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ
- నాగ్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్
- దాదాపుగా విదేశాల్లోనే జరిగిన చిత్రీకరణ
- ఆగస్టు 9వ తేదీన విడుదల
"నా లోనా నీవేనా ప్రేమై నేడు పూచేనా .. " అంటూ ఈ పాట సాగుతోంది. నాగ్ - రకుల్ పై చిత్రీకరించిన ఈ పాట కొత్తగా వుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. శుభం విశ్వనాథ్ సాహిత్యం .. చిన్మయి ఆలాపన .. ఆకట్టుకునేలా వున్నాయి. కీర్తి సురేశ్ .. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 9వ తేదీన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను విడుదల చేయనున్నారు.